Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. 42 కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న హైకోర్టు నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. కాగా, సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దోపిడీ, భూకబ్జా, రేషన్ కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులపై సీబీఐ దర్యాప్తు చేయాలని వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు దీదీ ప్రభుత్వాన్ని మందలించింది. ఈ విషయంలో రాష్ట్రం ఇప్పటికే నెలల తరబడి ఏమీ చేయడం లేదని పేర్కొంది. ఒకరిని కాపాడేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని బెంగాల్ ప్రభుత్వ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Read Also: Uttarpradesh : ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన కొత్త రైల్వే వంతెన..గాల్లో వేలాడుతున్న ట్రాక్లు
అలాగే, రేషన్ కుంభకోణంపై 43 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. తొందరలోనే అందరికి శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, జనవరి 5వ తేదీన సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై జరిగిన దాడిపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రేషన్ కుంభకోణం కేసులో టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఆకతాయిలు దాడి చేశారు. షాజహాన్ షేక్ సూచనల మేరకే దర్యాప్తు సంస్థ అధికారులపై దాడులు జరిగాయని బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపించారు. షాజహాన్, అతని సహచరులు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.