Trinamool Congress Leader: ‘‘ఇస్లాంని వ్యాప్తి చేయాలి’’.. తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- కోల్‌కతా మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- ముస్లిమేతరులు దురదృష్టవంతులు అని కామెంట్స్..
- ఇస్లాంని వ్యాప్తి చేయాలని పిలుపు..
- ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిమేతరులతో ఇస్లాంను వ్యాప్తి చేయాలంటూ, బహిరంగ మతమార్పిడులను ప్రోత్సహించారు. ముస్లిమేతరులు దురదృష్టవంతులని, అల్లాహ్‌ని సంతోషపెట్టడానికి వారిని ఈమాన్‌లోకి తీసుకురావానలి చెప్పడం వివాదాస్పదమైంది. ‘‘ఆల్ ఇండియా ఖురాన్ పోటీ’’ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని ధోనో ధన్యో ఆడిటోయంలో జూలై 3న ఈ కార్యక్రమం జరిగింది.
Read Also: Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
‘‘ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులు. వారు దురదృష్టంతో జన్మించారు. మేము వారిని ఇస్లాంలోకి తీసుకురావాలి’’ అని ఫిర్హాద్ హకీమ్ అన్నారు. ‘‘మనం ముస్లిమేతరుల మధ్య ఇస్లాంను వ్యాప్తి చే యాలి. మనం ఎవరినైనా ఇస్లాం మార్గంలోకి తీసుకురాగలిగితే, మనం నిజమైన ముస్లింలుగా నిరూపితమవుతాం’’ అని చెప్పారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఫిర్హాద్‌కి ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్ 2016లో కోల్‌కతాలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ‘‘మిని పాకిస్తాన్’’ అని పిలిచాడు.
ఇదిలా ఉంటే తృణమూల్ నేత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ..‘‘ పశ్చిమ బెంగాల్‌లో విపరీతమైన బుజ్జగింపు రాజకీయాల జరుగుతున్నాయి’’ అని దుయ్యబట్టారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలు బహిరంగ రహస్యం, టీఎంసీ అహంకారంతో విర్రవీగుతోందని, ఎన్నికల హింసాకాండతో ఇది స్పష్టమైందని మాల్వియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇది హిందూ మతంలోని లోతైన ఆధ్యాత్మికతను అవమానించడమే కాకుండా దేశం గౌరవించే సామస్యం, ఐక్యతను కూడా బెదిరిస్తోందని బెంగాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ అన్నారు.
People who were not born into Islam are unfortunate. We have to spread Islam among those people (Hindus), who are not followers of Islam. Those who are born in Islam, will reach jannat.
– Firhad Hakim, Kolkata Mayor and TMC Leader; 3rd July at Dhono Dhanyo Auditorium, Kolkata.… pic.twitter.com/Nrc9Piz0cI
— Amit Malviya (@amitmalviya) July 5, 2024
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!