Mamata Banerjee: ప్రియాంక గాంధీకి మద్దతుగా వయనాడ్‌లో బెంగాల్ సీఎం ప్రచారం..!
- కాంగ్రెస్- టీఎంసీ మధ్య కుదిరిన సయోధ్య..
- మమతా బెనర్జీతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం..
- ప్రియాంక తరపున వయనాడ్ లో ప్రచారం చేయనున్న మమతా బెనర్జీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రితో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం భేటీ అయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
Read Also: Mancherial: మంచిర్యాలలో విచిత్ర ఘటన.. చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కాల్ లెటర్..
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
కాగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతుంది. రాష్ట్రంలో టీఎంసీ- కాంగ్రెస్ పోత్తు చర్చలు విఫలం కావడానికి అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ భారతీయ జనతా పార్టీపై పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు ఏకంగా 29 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీ.. కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు కొనసాగించారు.
Read Also: Train Stuck On Bridge: బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..
ఇందులో భాగంగానే.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తొలుత సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా, అనంతరం ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఇక టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సాగరికా ఘోసే, సాకేత్ గోఖలేలు ఎగ్జిట్ పోల్స్ అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్సీపీ నేతలతో కలిసి ధర్నా కూడా చేశారు. అయితే, ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు పీ చిదంబరం నేరుగా చర్చలకు వెళ్లారు. మరోవైపు, అధీర్ రంజన్ చౌదరి కూడా మమతా బెనర్జీపై విమర్శలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తనకు మమతతో రాజకీయంగా తప్ప వ్యక్తిగత అభిప్రాబేధాలు ఏమీ లేవంటూ అధీర్ రంజన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం మమత కూడా ప్రియాంక గాంధీ తరపున వయనాడ్‌లో ప్రచారం చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!