West Bengal: నడిరోడ్డుపై మహిళను కొట్టిన తృణమూల్ నేత.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్..
- నడిరోడ్డుపై మహిళపై తృణమూల్ నేత దాడి..
- వైరల్ వీడియోపై బీజేపీ ఆగ్రహం..
- మమతా బెనర్జీ పాలనలో అరాచకమని ఫైర్..
- సందేశ్‌ఖాలీ ఘటనతో పోలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగా మహిళతో పాటు మరో వ్యక్తిని దారుణంగా కొడుతున్న ఘటన వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడుతోంది. నిందితుడు తృణమూల్‌కి చెందిన స్థానికంగా ఉండే బలమైన నేత అని బీజేపీ ఆరోపించింది. ఈ వీడియో బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రాకి చెందినదిగా బీజేపీ, సీపీఎం ఆరోపించాయి.
Read Also: Reasi bus attack: రియాసి బస్ అటాక్.. ఎన్ఐఏ సోదాల్లో కీలక విషయాలు..
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ప్రతిపక్షాలు నిందితుడిని స్థానికంగా బలమైన వ్యక్తిని తాజెముల్‌గా గుర్తించారు. ఇతడికి అధికార టీఎంసీతో సంబంధాలు ఉన్నాయి. స్థానిక వివాదాల్లో తక్షణ న్యాయం అందించే వ్యక్తిగా ఇతనికి పేరుంది. అయితే, వైరల్ అవుతున్న వీడియోలో బాధితులను ఎందుకు కొడుతున్నాడనే విషయం అస్పష్టంగా ఉంది. ఈ వీడియోపై తృణమూల్ కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ రాక్షస పాలనకు ఈ ఘటన నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. ‘‘ఒక మహిళను కనికరం లేకుండా కొడుతున్న వ్యక్తి తాజెముల్. ఇతడు సత్వర న్యాయం చేయడానికి ప్రసిద్ధి చెందాడు. చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ సన్నిహితుడు.పశ్చిమ బెంగాల్‌లో షరియా కోర్టుల వాస్తవితపై దేశం మేల్కోవాలి. ప్రతీ గ్రామంలో సందేశ్‌ఖాలీ ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళలకు శాపం. సందేశ్‌ఖాలీ ఘటనలో నిందితుడిని రక్షించినట్లు ఇతడిని కూడా రక్షిస్తుందా..?’’ అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
https://twitter.com/amitmalviya/status/1807341290520289486
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?