JP Nadda: బెంగాల్ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు..
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆగ్రహం..
- బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదని విమర్శించిన జేపీ నడ్డా..
- నిందితులను ప్రభుత్వం కట్టడి చేయడం లేదు: కేంద్రమంత్రి జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: పశ్చిమ బెంగాల్‌లో ఓ జంటపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే దీదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా నడ్డా స్పందించారు.. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది అని ప్రస్తావించారు. మతం పేరుతో చేస్తున్న క్రూరత్వానికి ఇది నిదర్శనం అంటూ ఆయన మండిపడ్డారు. దీనిని వ్యతిరేకించడానికి బదులు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. సందేశ్‌ఖాలీ, ఉత్తర దినాజ్‌పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు తగిన భద్రత లేదు అని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.
Read Also: INDIA Bloc: నీట్‌పై పార్లమెంట్లో మళ్లీ గందరగోళం.. లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్..
Also Read
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా బెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో వెదురుకర్రతో ఓ జంటను ఇష్టం వచ్చినట్లు కొడుతున్న వ్యక్తి ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్‌ముల్ అలియాస్ జేసీబీగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..