Bangladeshi Hindus: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలైన హిందువులను టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ (భారత సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు) నుంచి చాలా హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి రావాలనుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కుమేద్పూర్ వద్ద గూడ్స్ రైలు ఐదు కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయాన్ని రైల్వే అధికార ప్రతినిధి ధృవీకరించారు.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల చొరబాట్లు దేశ జనాభాకు ముప్పుగా పేర్కొన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈ చొరబాట్లను అడ్డుకోవడంతో జార్ఖండ్, బెంగాల్ ప్రభుత్వాలు మెతక వైఖరిని అవలంభిస్తున్నాయని దుయ్యబట్టారు.
Adhir Ranjan: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఎన్డీయే కూటమిలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆహ్వానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ అథవాలే మాట్లాడుతూ.. అతను (అధిర్ రంజన్) పశ్చిమ బెంగాల్ నుంచి ఓడిపోయినందుకు కాంగ్రెస్ విస్మరించిందని, అవమానించబడ్డాడని అన్నారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ని విభజించే అన్ని చర్యల్ని తిప్పికొడుతామని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. బెంగాల్ని విభజించేందుకు వారిని రానివ్వండి.. దాన్ని ఎలా అడ్దడుకోవాలో వారికి చెబుతాం అని అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు అన్నారు.
Mamata Banerjee: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేసింది. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆరోపించింది.
Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గర పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాయి.
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.