Bengal Governor: బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని బెంగాల్ గవర్నర్ కార్యాలయం కోరింది. తీవ్ర గందరగోళం నెలకొన్ని పొరుగు దేశంలో నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు బెంగాల్ రాష్ట్ర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆదివారం దీదీ పేర్కొన్నారు. అయితే, సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Budget 2024-25: Budget 2024-25: కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి రూ.15 వేలు..!
అయితే, సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యలపై రాజ్‌భవన్ రియాక్ట్ అవుతూ.. విదేశీ వ్యవహారాల్లో భాగమైన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్ర సర్కార్ కు మాత్రమే ఉంది.. ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా నిర్ణయం తీసుకొనే అధికారం లేదని చెప్పుకొచ్చింది. విదేశీయులకు వసతి కల్పించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తామంటూ సీఎం చేసిన బహిరంగ ప్రకటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని బెంగాల్ రాజ్ భవన్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం దీదీ తాను చేసిన కామెంట్స్ పై పూర్తి స్థాయిలో నివేదికను అందజేయాల్సిందిగా గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరినట్లు రాజ్‌భవన్ అధికారులు చెప్పుకొచ్చారు.