Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..
- మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- భారత్‌కి నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది. “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ వైపు నుండి మాకు దౌత్యపరమైన నోట్ అందిందని నేను ధృవీకరించగలను” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. విదేశీ వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి వచ్చే అంశమని ఆయన చెప్పారు.
Read Also: Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల ఆర్చరీ జట్టు..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
జూలై 21న కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆశ్రయం కోరే బంగ్లాదేశీయులకు బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని ఆమె అన్నారు. హింస నుంచి వచ్చే శరణార్థులను, పొరుగు దేశాల వారిని గౌరవించాలని, వారికి వసతి కల్పించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉందని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు రెచ్చగోట్టేవిగా, అసమర్థమైనవిగా అభివర్ణించింది. హింసాత్మక పరిస్థితుల్ని చక్కదిద్దతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించింది. ఇటీవల బంగ్లాదేశ్ వ్యాప్తంగా రిజర్వేషన్లపై భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. వీటిలో 150 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!