Maanas-Annie: రొమాంటిక్ కామెడీ జానర్‌లో ‘చి. ల. సౌ. రాంబాబు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ కొత్త వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాలలో, సీరియళ్లలో నటించి చక్కని గుర్తింపు పొందిన మానస్ తొలిసారి ఓటీటీ కోసం ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నాడు. అతని సరసన ‘రాజన్న’ ఫేమ్ యానీ నాయికగా నటించబోతోంది. విశేషం ఏమంటే మానస్ లానే యానీ సైతం బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఆమె ‘లూజర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్రను పోషించింది. రొమాంటిక్ కామెడీ జనర్ కు చెందిన ‘చి. ల. సౌ. రాంబాబు’ వెబ్ సీరిస్ ను పిఆర్ఎన్ బాబు దర్శకత్వంలో రమేశ్ చంద్ర సమర్పణలో రవి బండా నిర్మిస్తున్నారు. శశిప్రీతమ్ దీనికి సంగీతాన్ని అందిస్తుండగా రాజీవ్ వల్లభనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి శివ గోపాల్ రెడ్డి క్రియేటివ్ హెడ్.
మహాశివరాత్రి సందర్భంగా ‘చి.ల.సౌ. రాంబాబు’ వెబ్ సీరిస్ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో మంగళవారం ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 10వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నారు. ‘బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ మనసుకు నచ్చిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నానని, ఇది కూడా అలాంటిదేన’ని మానస్ తెలిపాడు. ‘సరదాగా సాగిపోయే రొమాంటిక్ కామెడీ కథ ఇదని, ఇలాంటి వాటి కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాన’ని యానీ చెప్పింది. ‘క్వాలిటీ స్క్రిప్ట్స్ కే తమ తొలి ప్రాధాన్యమని, దానికి తగ్గట్టుగానే రాజీపడకుండా నిర్మించాలన్నది తమ ఆశయమని, రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాబోయే రెండేళ్ళలో మరింతగా ఓటీటీ కంటెంట్ ను అందిస్తామని నిర్మాత రవి బండా అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!