తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.
Also Read: Bhatti Vikramarka : కేసీఆర్ పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం
మరోవైపు రాజధాని హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది.అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్టికాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్నటి నుంచి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్నాహం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్‌తో పాటు సైదాబాద్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.