వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా ఏప్రిల్ 15 వరకు, పశ్చిమ బెంగాల్, బీహార్ ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 17 వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావారణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.
దేశంలోని కొన్ని ప్రాంతాలు వేడిగాలులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఒడిశాలో గురువారం రోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ నెలలో అత్యధికం. రాబోయే 3 రోజులు ఎండల తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేసింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు.
Also Read:Rishab Shetty: బీజేపీకి కాంతారా స్టార్ సపోర్ట్.? బొమ్మైని కలిసిన రిషబ్ శెట్టి
మరోవైపు జార్ఖండ్‌లోనినూ 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడంతో వేడి గాలులు పెరిగాయి. జంషెడ్‌పూర్,డాల్తోన్‌గంజ్‌లో 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఏప్రిల్ 13న రాష్ట్రంలో అత్యధికంగా రాంచీలో 38.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 2.3 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత ప్రస్తుత ఉష్ణోగ్రత కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అధికారులు చెప్పారు. ఏప్రిల్ 20 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రత 37 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read:Gangster Atiq Ahmed: తండ్రి కాన్వాయ్‌పై దాడికి అసద్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు ..
పశ్చిమ బెంగాల్‌లో వారాంతంలో వేడి గాలుల పరిస్థితులు కొనసాగుతాయి. బంకురా, పురూలియా, పశ్చిమ్ మెదినీపూర్, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్ జిల్లాలు వేడిగాలులు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 2-4 డిగ్రీలు పెరగవచ్చు. తీవ్రమైన వేడి కారణంగా, పశ్చిమ బెంగాల్‌లో వేసవి సెలవులను రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు మే 2 నుండి ప్రారంభమవుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం అత్యంత వేడి ఫిబ్రవరిని అనుభవించింది. అయినప్పటికీ, మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచింది.
Heat wave conditions likely over Gangetic West Bengal, Odisha, Coastal Andhra Pradesh and Bihar.@ndmaindia pic.twitter.com/pFSS2JWidk
— India Meteorological Department (@Indiametdept) April 13, 2023