భారతదేశం తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది, అగ్రస్థానంలో ఉన్న నగరం 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
Also Read:Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ.. ఫీజుల వివరాలు ఇవే..
వాతావరణ కార్యాలయం యొక్క జాబితాలో మొదటి రెండు స్థానాలను పశ్చిమ బెంగాల్‌లోని నగరాలు ఉన్నాయి. ముర్షిదాబాద్‌లో 43 డిగ్రీలు, బంకురాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోనూ ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఢిల్లీ సహా దేశంలో ఐదు నగరాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజస్థాన్‌లోని చురు, చండీగఢ్, ఆంధ్రాలోని విజయవాడ, గురుగ్రామ్ గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యాయి. బుధవారం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని తేలికపాటి వర్షంతో ఢిల్లీలో వేడి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD అంచనా వేసింది.
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, రాబోయే రెండు రోజులలో దేశంలోని వాయువ్య ప్రాంతంలో వేడి గాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని IMD తెలిపింది. ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమంలో 13 మంది వడదెబ్బతో మృతి చెందారు.
Also Read:Cm Jagan : ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
మరోవైపు పంజాబ్, హర్యానా, బీహార్,కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హర్యానా, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. హిసార్‌లో 41.5 డిగ్రీల వద్ద స్థిరపడగా, పంజాబ్‌లోని భటిండాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు రోజుల పాటు తీవ్రమైన వేడి గాలులు ఉంటాయని IMD తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను శనివారం వరకు మూసివేయాలని కోరారు.
రాష్ట్రంలో వేడిగాలుల వంటి పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుండి 23 వరకు అన్ని ప్రభుత్వ, రాష్ట్ర సహాయ పాఠశాలలను మూసివేయనున్నట్లు త్రిపుర తెలిపింది. గతంలో ఒడిశా కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది.మే 31 వరకు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల పరిస్థితులతో పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవచ్చు అని శాస్త్రవేతలు చెబుతున్నారు.