తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ళ వాన బీభత్సం సృష్టిస్తోంది.. కోతకు వచ్చిన పంటలు వడగళ్ళ బారిన పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి విచ్చిన్నం, ద్రోణులు ప్రభావంతో సంభవిస్తున్న మార్పులు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఒక్కోసారి విపరీతమయిన ఎండ, మరోసారి వడగళ్లవానలు పడుతున్నాయి. రాబోయే ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడతాయి. క్యూమ్యూలో నింబస్ మేఘాలతో కొన్ని చోట్ల కుండపోత వానలు కూడా పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also:Bhatti Vikramarka Pressmeet Live: భట్టి విక్రమార్క కీలక ప్రెస్ మీట్
కొన్ని చోట్ల గంటకు40- 50కిమీ వేగంతో గాలి దుమారం వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్రికెట్ బాల్ సైజులో వడగళ్లకు అవకాశం వుంది. పగటి పూట సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు పూర్తిస్థాయి లో అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
Read Also: Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో అన్నీ ఫ్లాపులే…