Warangal: వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. Read also: Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..! వరంగల్ నగర అభివృద్ధికి…
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్‌లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. Also Read: Gold Rate Today: నేడు…
అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలిసిస్ క్లినిక్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్ వరంగల్‌లో ప్రారంభించింది.
Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం…
Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేష్ గౌడ్ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో…
వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాల పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు…
KNRUHS: వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్‌లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం…