వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కులత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్. దీనిలో భాగంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి. ఆ తర్వాత తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు…
వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సర్జరీలు నిలిచిపోయాయి. ఏసీలు పనిచేయకపోవడంతో వైద్యులు సర్జరీలను నిలిపివేశారు. వారం రోజుల నుంచి ఆసుపత్రి లో సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేఎంసి సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజు 10 నుంచి 15 సర్జరీలు జరుగుతుంటాయి. సర్జరీలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. Also Read:Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ సర్జరీలు నిర్వహించాల్సిన పేషంట్లను వైద్యులు ఆన్ లీవ్ పై శనివారం ఇంటికి పంపించారు.…
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు అదుపుతప్పి పడిపోయింది. ఆ కారులో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారు కాలువలో పడగా.. స్థానికులు గమనించి కారులో నుంచి మహిళను కాపాడారు స్థానికులు. బాలుడు మృతి చెందాడు.
SBI Bank: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 2024 నవంబర్ 19వ తేదీన బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులు నిరసన చేస్తున్నారు.
Mamunur Airport: వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పాటు నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో…
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని……
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది..
మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు.