Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఎఎస్ పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) త్వరలో వరంగల్ ప్రాంతంలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తిరేటు తగ్గించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం ప్రారంభం అయిన వ్యవసాయ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో పత్తిని రైతులు తీసుకువచ్చారు.
ఓరుగల్లు కాంగ్రెస్ పోరుకు కేరాఫ్ అవుతోందా? మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మొదలైన వ్యవహారం మొత్తం పార్టీకే చుట్టుకుంటోందా? ఏకంగా అధికార పార్టీ కేడరే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడాన్ని ఎలా చూడాలి? మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కొత్త వివాదానికి తెర తీశారా? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.
హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.
అసలే కష్టాల్లో ఉన్న గులాబీ దళాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాన్ చుట్టుముట్టబోతోందా? బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? సీఐడీ దర్యాప్తులో ఏం తేలుతోంది? ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీఎంఆర్ ఎఫ్ స్కాం ప్రకంపనలు వరంగల్లోనూ కనిపిస్తున్నాయి. పేదోళ్ల వైద్య సేవలకు కేటాయించే సీఎం సహాయనిధిపై కన్నేసిన కొన్ని బడా ఆస్పత్రులు.. నకిలీ పేషెంట్స్, దొంగ బిల్లులతో కోట్లు కొల్లగొ…