అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలిసిస్ క్లినిక్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్ వరంగల్‌లో ప్రారంభించింది. దీని ఉద్దేశ్యం మూత్రపిండ సమస్యలు (కిడ్నీసమస్యలు) ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలిసిస్ వైద్యసేవలు అందించడం.. అధునాతన సాంకేతికతతో నిర్మించబడిన ఈ సెంటర్‌లో అనుభవజ్ఞులైన నెఫ్రోలజిస్ట్‌లు (కిడ్నీనిపుణులు), ప్రత్యేక శిక్షణ పొందిన డయాలిసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు. రోగులు ఇకపై ఆరోగ్య శ్రీ, ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలిసిస్ సేవలను పొందవచ్చు. ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తుంది. మా లక్ష్యం ప్రపంచస్థాయి వైద్యసేవలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో కల్పించడం.
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు..
అపోలో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభం సందర్భంగా ప్రముఖుల వ్యాఖ్యలు:
డా. నిర్మల్ పాపయ్య ఎం.డి., డీఎమ్., సీనియర్ నెఫ్రోలజిస్ట్ మాట్లాడుతూ.. డయాలిసిస్ చికిత్సలో వేగం, సమగ్రత ఎంతో అవసరం అని అన్నారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులను సమయానికి గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. ఈ డయాలిసిస్ సెంటర్ ఆధునిక పద్ధతులతో కూడిన చికిత్సలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. M. సుధాకర్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఈ అధునాతనమైన డయాలిసిస్ క్లినిక్ ద్వారా అనేక మంది కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన డయాలిసిస్ సేవలను అందించటం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ బీమా పథకాల సహకారంతో సేవలను అందించడం ద్వారా.. ప్రతి డయాలిసిస్ రోగి తగిన చికిత్స పొందేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో అపోలో డయాలసిస్ క్లినిక్‌లు నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలకు, మండలాల స్థాయికి కూడా విస్తరిస్తూ మెరుగైన వైద్యసేవలను అందించటానికిప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది సహకారంతో ప్రపంచ స్థాయి డయాలిసిస్ సేవలను ప్రతి రోగికి అందేలా.. కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. N. సంపత్ రావు, ఛైర్మన్, NSR గ్రూప్ మాట్లాడుతూ.. తమ హాస్పిటల్‌లో అపోలో డయాలిసిస్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం అని అన్నారు. అధునాతన కిడ్నీ చికిత్సను అందించడంలో భాగస్వామ్యం కావడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. తాము మరికొందరు రోగులకు ఈ సేవలను అందించడానికి కృషి చేస్తామని చెప్పారు.
Matthew Breetzke: తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ప్లేయర్ రికార్డ్..
అపోలో డయాలిసిస్ క్లినిక్ గురించి:
అపోలో డయాలిసిస్ భారతదేశంలోప్రముఖ మూత్రపిండ సంరక్షణ సేవలను అందించే సంస్థ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసోం, బీహార్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో140+ కేంద్రాలతో సేవలు విస్తరించాయి. అంతేకాకుండా.. హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్, పిల్లల డయాలిసిస్, మూత్రపిండ మార్పిడి (కిడ్నీట్రాన్స్‌ప్లాంట్) సేవలను అందిస్తున్నాయి. పల్లెటూర్లు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన మూత్రపిండ సంరక్షణను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిబద్ధంగా ఉన్నామని తెలిపారు.
అపోలో హెల్త్& లైఫ్‌స్టైల్ లిమిటెడ్ గురించి:
అపోలో హెల్త్& లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (AHLL)అనేది అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ (AHEL) అనుబంధ సంస్థ. 2002 నుండి భారతదేశంలో 5500+ వైద్యులతో 20 మిలియన్+ మంది రోగులకు సేవలు అందించాయి. తృటిలో ఆసుపత్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండా.. ఇంటికి దగ్గరగా అత్యుత్తమ వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపింది.