Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం ఇది కానీ అది మానేయాలంటే రిహాబిటేషన్ సెంటర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తేనే వారి ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు సినీనటి గౌతమి.
Gottipati Ravi Kumar: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేస్తాం..
అంతేకాకుండా.. ఎన్జీవోస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పేదలకు న్యూట్రిషన్ షెడ్ ఫ్రీగా ఇచ్చేలాగా సహకరించాలంటూ విజ్ఞప్తి చేసిన సినీనటి గౌతమి.. నేను క్యాన్సర్ బారిన పడ్డాను క్యాన్సర్‌ని తొలినాళ్లలో గుర్తించడం వల్ల క్యాన్సర్‌ను జయించగలిగాని తెలిపారు. నా కూతురికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని, ఐదో బర్త్‌డే, ఆరో బర్‌డే చూస్తానో లేదో అని భయపడ్డా నేను.. క్యాన్సర్‌కు సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు 25 బర్త్‌డే కూడా ఘనంగా చేయగలిగానని ఆమె వ్యాఖ్యానించారు.
క్యాన్సర్ వచ్చిందంటే భయపడి పోకుండా నిపుణులైన వైద్యుల సహకారంతో మంచి వైద్యం చేసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని, క్యాన్సర్ ఎంత ముందుగా గుర్తిస్తే అంత త్వరగా క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అన్ని రకాల క్యాన్సర్ మీద ప్రజలకు అవగాహన పెంచేలాగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెద్ది ఎత్తున నిర్వహించాలని ఆమె కోరారు.
Mantra Electric Scooters: ఎలక్ట్రిక్ సైకిల్ ధరలో.. మంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్స్.. కేవలం రూ. 35 వేలకే!