నేటి నుంచి వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ 25’ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు (మార్చి రెండవ తేదీ వరకు) వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. వసంతోత్సవాలను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించనున్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 25 కోసం విద్యార్థులు వరంగల్ నిట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిట్ కళకళలాడుతోంది. వరంగల్ నిట్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు.…
ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు.
వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఉంటున్న రేష్మిత కుటుంబ…
రాష్ట్రంలో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి…
Warangal: వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తుండగా, పోలీసులు ఆధారాలను అనుసరించి కీలక నిందితులను పట్టుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నానికి సంగారెడ్డిలోనే పథకం రూపొందించారని పోలీసులు గుర్తించారు. రెండు బైకులపై ముగ్గురు వ్యక్తులు డాక్టర్ సుమంత్ రెడ్డిని వెంబడించి, వరంగల్‌లో నడి రోడ్డుపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఈ ఘోరమైన ఘటనలో…
Maoist : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్భందాలతో పాటు వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోంది. అనేక మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణిస్తుండగా, మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వంజెం కేషా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి…
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Tim Southee: న్యూజిలాండ్ ఛాంపియన్స్…
Warangal: వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. Read also: Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..! వరంగల్ నగర అభివృద్ధికి…
Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. Also Read: Gold Rate Today: నేడు…