Komatireddy Venkat Reddy : మామునూర్ ఎయిర్ పోర్ట్‌కు కేంద్రం ఆమోదం..
- మామునూర్ ఎయిర్ పోర్ట్ కి కేంద్రం అనుమతి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న NOC అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు.
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయ ప్రాధికార సంస్థ (AAI) UO నోట్ నెం. PLG/501/Warangal /2025/80 తేదీ 03.02.2025 ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం 05.12.2024 , 17.11.2024 తేదీలలో పంపిన లేఖలను ప్రస్తావిస్తూ, హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) జారీ చేసినట్లు లేఖలో పేర్కొందని తెలిపిన మంత్రి అందుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు.
అంతేకాదు, మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థ (AAI)కి అప్పగించేందుకు ఇంతకు ముందే 205 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం – హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) మధ్య ఒప్పందం :
హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మించేటప్పుడు కేంద్రంతో.. హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) సంస్థ చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల లోపల, 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి , మరో కొత్త దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని ఆనాడు HIALకేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ పరిధిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే, రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి అభ్యర్ధన మేరకు HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది.
Vivo T4x 5G: బడ్జెట్ ధరలో.. పవర్ ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చేస్తోన్న వివో కొత్త స్మార్ట్ ఫోన్
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!