Sumanth Reddy: భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
- భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
- గత నెల 20వ తేదీన దాడి
- ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన డాక్టర్ సుమంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కోలుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఒక రోజు చికిత్స పొందిన అనంతరం ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
Read Also: IIT Baba: ఐఐటీ బాబాపై దాడి.. టీవీ డిబేట్‌లో తనను కొట్టారని ఆరోపణ..
Also Read
ఈ కేసులో నిందితులైన డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు సామెల్, అలాగే సామెల్ స్నేహితుడు, ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సూత్రధారులు ఫ్లోరా, సామెల్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి మృతదేహాన్ని మార్చురీలోకి తరలించిన వైద్యులు, ఈరోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఘటన కుటుంబ కలహాల కారణంగా చోటుచేసుకుందా? లేక మరేదైనా కారణముందా? అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను స్థానికంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!