Errabelli Dayakar Rao: ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవాలి.. క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి!
- ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఎర్రబెల్లి
- మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి
- కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సందర్శించారు. మార్కెట్లో రైతులను కలిసి పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. మార్కెట్లో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 25 వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలంటూ నినాదాలు చేశారు. వారం రోజుల సమయం ఇస్తున్నాం అని, ఈలోపు మిర్చికి 25 వేల మద్దతు ధర ఇవ్వకపోతే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
Also Read
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
‘అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. బోనస్ వస్తది అని చెపితే.. రైతులు సన్నరకాలు సాగు చేశారు. రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మిర్చిని రూ.15000 కొనుగొలు చేస్తాం అని చెప్పింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత వచ్చింది. మార్క్ ఫైడ్ ద్వారా మిర్చిని క్వింటాకు రూ.25000 కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!