విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read:Tim Southee: న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందని ఆశిస్తున్నా..
వరంగల్ ఏకశిలా జూనియర్ కాలేజీలో ఓ విద్యా్ర్థిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆ విద్యార్థినితో ఓ ఉపాధ్యాయుడి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వెంటనే కాలేజీకి చేరుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కీచక ఉపాధ్యాయున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కీచక ఉపాధ్యాయున్ని కళాశాల యాజమాన్యం దాచిపెట్టిందని ఆరోపించారు. ఆ కీచకున్ని కళాశాలకు పిలిపించాలని విద్యార్థిని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళనతో కళాశాల ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది.