ఈనెల 21న వరంగల్ జిల్లాకు సిఎం కేసిఆర్ రానున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల సముదాయాల నిర్మాణం అవుతోందన్నారు.…
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పై జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీ పీ వో )తో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్…
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
సిటీలు, పట్టణాలు, గ్రామాలు, గూడాలు, మారుమూల ప్రాంతాలనే కాదు.. అడవిలో ఉన్న అన్నల వరకు చేరింది కరోనా వైరస్… కోవిడ్ చికిత్స కోసం వచ్చి.. మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి మరియు ఓ కొరియర్ పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగుచూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేశారు.. కారు వెనుక భాగంలో…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్,…
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది…
వరంగల్ నగరంలోని కొవిడ్ చికిత్స అందిస్తున్న హన్మకొండలోని మ్యాక్స్‌కేర్, వరంగల్ ములుగు రోడ్డులోని లలిత ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండు హాస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. రెండు రోజుల కిందట అర్బన్‌లోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ఛార్జీల వసూలు, సౌకర్యాల లోపంపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నేరుగా నోటీసులు జారీ చేసింది. అందులో పేర్కొన్న రెండు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స…
వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం…