ప్రపంచంలోనే పెద్దాస్పత్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం చేసి యాదాద్రికి బయల్దేరుతారని తెలిపారు.
సెంట్రల్ జైల్ స్థలంలో 30 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని.. ప్రస్తుతం కెనడాలో మాత్రమే 24అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోఉందని గుర్తుచేశారు ఎర్రబెల్లి.. వరంగల్ లో నిర్మించే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్దదన్న ఆయన.. ఆస్పత్రులు వస్తే బీజేపీ నేతలను నష్టం ఏంటి..? అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ నేతలు కోర్టుకు పోయి ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. మీ పార్టీలో చేరిన వారంతా భూములు ఆక్రమించుకున్న వారే నంటూ ఎద్దేవా చేశారు.. వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉందని ప్రశంసలు కురిపించిన ఎర్రబెల్లి.. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి మెరుగైన వైద్యం అందించిందన్నారు.. కాగా, వరంగల్‌లో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం వరంగల్ సెంట్రల్ జైలును అక్కడి నుంచి తరలించిన సంగతి తెలిసిందే.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!