నడిరోడ్డుపై పెట్రోల్ పోశారు.. నిప్పంటించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టారు.. అరెస్ట్ చేశారు. అక్కడితో కేసు కంచికి చేరినట్టేనా? కీలకమైన సంస్థను, ఆ సంస్థ ప్రతినిధులను కేసు నుంచి తప్పించారా? రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయా? ఓరుగల్లు పెట్రోల్ దాడిపై జరుగుతున్న రచ్చేంటి? కేసులో చిట్‌ఫండ్ సంస్థను తప్పించారా? వరంగల్‌లో నడిరోడ్డుపై.. పట్టపగలు జరిగిన ఈ పెట్రోల్ దాడి ఓ పెను సంచలనం. చిట్టీలో పాడుకున్న డబ్బులు అడిగినందుకు రాజు అనే వ్యక్తిపై ఈ విధంగా పెట్రోల్…
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను…
కడియం శ్రీ హరి మరియు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీ హరి అన్నారు. అయితే… దీనికి కౌంటర్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. కేసీఆర్ తాను ఎలాంటి వరాలు అడిగినా ఇస్తారని పేర్కొన్నారు. అయితే… తాజాగా కడియం శ్రీ హరి మరియు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య…
ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదయ్యింది. బలరాంనాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది కోర్టు. వీరి పై హనంకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదయ్యింది. కానీ ఈ కేసు విచారణకు హాజరుకానందున ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు తెలిపింది. అయితే ఎన్‌బీడబ్ల్యూ జారీతో కోర్టుకు హాజరయ్యారు బలరాం నాయక్. దాంతో బలరాంనాయక్‌పై…
అది తొమ్మిది జిల్లాలకు హెడ్ ఆఫీస్. నిన్న మొన్నటి వరకు ఆ శాఖకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. దానికి రాజకీయ సెగ తగలడంతో ఒక్కటే చర్చ. ఇంతకీ ఆఫీస్ ఏంటి? ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం. ఇంటర్ విద్యలో 9 జిల్లాలకు వరంగల్ ఆర్వో ఆఫీస్ కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే ఇంటర్‌బోర్డులో మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో…
జన చైతన్య ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాపై నమ్మకం తో 3 శాఖలు అప్పగించారు. స్వాతంత్య్రము వచ్చాక ఎన్నడూ లేని విదంగా కేంద్ర మంత్రివర్గం లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టాను. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి. ఇంకా 200 దేశాలను కరోనా వ్యాధి పట్టి పీడిస్తుంది. గతంలో ఇతర దేశాల నుండి మందులు…
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భౌగోళిక మార్పులు ఆ ప్రజాప్రతినిధి పదవికి ఎసరు పెడుతున్నాయా? ఇరుకున పెట్టాలనే వైరివర్గం చక్రం తిప్పిందా? చివరిక్షణంలో మారిన పరిణామాలు దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరి పదవికి ముప్పు పొంచి ఉంది? హన్మకొండజిల్లాలో కలిసిన శాయంపేట.. ఇరకాటంలో గండ్ర జ్యోతి! గండ్ర జ్యోతి. వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్. వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై చర్చ ఎలా ఉన్నా.. ఆమె పరిస్థితిపై ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా…
వరంగల్ పట్టణంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి విచ్చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆత్మీయ స్వాగతం పలికారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించికున్నారు జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎం.పి సంతోష్ కుమార్, తూర్పు శాసనసభ్యులు నరేందర్, ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి…
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో…
తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన దిగింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం…