తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ది పై ఎంతో ఫోకస్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరంగల్ లో ఐటీ పార్క్ ను అభివృద్ది చేసింది. ఈ వరంగల్ ఐటీ పార్క్ కారణంగా చాలా మందికి ఉపాది కలుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు వస్తున్నాయి. తాజాగా మరో కంపనీ 1350 మందికి ఉపాది కల్పించనుంది. ఏ-థీరమ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరంగల్ ఐటి పార్క్‌లో తన కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధం అయింది. ఈ కంపెనీ 1,350 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు కంపెనీ ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ సిఇఒ రాపోలు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. “ప్రతి సంవత్సరం, వందలాది ఇంజనీరింగ్ విద్యార్థులు వివిధ కళాశాలల నుండి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ వారు ఉపాధి పొందడం కష్టమని, వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు వెతుక్కుంటూ మెట్రో నగరాలకు వలసపోతున్నారు. కాబట్టి మా యూనిట్‌ను ఇక్కడ వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రతిభావంతులైన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మేం ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ 1,300 కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలను సృష్టిస్తుంది. ” అని పేర్కొన్నారు. అయితే.. సిఇఒ అరుణ్ కుమార్ జనగామ జిల్లాకు చెందిన వాడే కావడం విశేషం.