ఈనెల 21న వరంగల్ జిల్లాకు సిఎం కేసిఆర్ రానున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల సముదాయాల నిర్మాణం అవుతోందన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ది కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు అని… అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేందుకు సమీకృత కార్యాలయాల సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని.. నిధులు, హక్కుల కోసం నాడు సమైఖ్య పాలకులపై పోరాటం చేశామని… నేడు కేంద్ర పాలకులపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి, నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. కేసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని..సిఎం వరంగల్ పర్యటన సంధర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని పిలుపునిచ్చారు.