నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలకరిలో వర్షాలు కురుస్తుండటంతో పంట పొలాలను దున్నేందుకు సిద్దం అవుతున్నారు రైతులు.