రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…
ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా…
వరంగల్ లో జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు.. వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ లో పోసిన ధాన్యం 15 నుండి 20 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడంలేదని జాతీయ రహదారి 563 పై ధర్నా చేపట్టారు రైతులు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కాంటాలు అయ్యేలా పరిష్కరించాలని రైతులు కోరారు. మార్కెట్ సెక్రటరీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడని రైతులు ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ రైతులతో మాట్లాడి ధర్నా…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోబోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక…
మరికొన్ని నెలల్లో వరంగల్‌లో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 65వ డివిజన్ తెరాస అభ్యర్థి గగులోతు దివ్య తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు.…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. మరణించిన వ్యక్తికీ బుధవారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆశా వర్కర్ మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. మరణించిన వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అయితే, అప్పటికే మరణించిన వ్యక్తికీ అంత్యక్రియలు నిర్వహించడం, ఆ…
ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ గతంలోనే…
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వరంగల్‌లో పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది.. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను ప్రారంభించిన కేటీఆర్.. రూ. 2 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.. అనంతరం.. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు.. కాన్వాయ్ వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు…