Kakatiya Utsavalu : కాకతీయ ఉత్సవాలకు సిద్ధమైన ఓరుగల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చారిత్రక వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయ ఉత్సవాలకు కాకతీయ వంశానికి చెందిన 22వ వారసుడు అయినా కమల్‌చంద్ర బాంజ్‌దేవ్ పాల్గొననున్నారు.
Read Also: RajyaSabha: రాజ్యసభలో తెలుగు సినీజనం!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2012 డిసెంబర్ 21నుండి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017-18ల్లో ‘ఓరుగల్లు కళావైభవం’పేర ఉత్సవాలు కొనసాగాయి. అనంతర కాలంలో రామప్ప దేవాలయం నిర్మించి ఎనిమిది వందల సంవత్సరాలు అయిన సందర్భంలో ఉత్సవాలు జరిపారు. తాజాగా కాకతీయ సప్తాహం పేరున మరోసారి ఇప్పుడు జూలై ఏడు నుండి పదమూడవ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను నాటి కాకతీయ రాజధాని ఓరుగల్లు ఖిల్లాలో టూరిజం శాఖమంత్రి శ్రీనివాసగౌడ్, మంత్రి సత్యవతిరాథోడ్, చీప్‌విప్ వినయ్ భాస్కర్, ఎంపి సంతోష్‌కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధలు కలిసి ప్రారంభించనున్నారు. కాకతీయులు మట్టికోట, పుట్టకోట అంటూ ఏడు ప్రాకారాలతో కోట నిర్మాణం చేసుకున్నారు. దాని గుర్తుగా ఏడు కోటల పరిధిలో ఉత్సవాలను నిర్వహించ తలపెట్టారు. ఈ సందర్భంగా పేరిణి నృత్యాలు, కోలాటాలు సాహితీ సమావేశాలు, సెమినార్‌లను నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!