Agnipath Protests: ఆగని అగ్నిపథ్ ఆందోళనలు.. వరంగల్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెర మీదికి తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా నిరసన చేపట్టింది. బీజేపీ జిల్లా ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేయటం ఏంటని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. బీజేపీ ఆఫీసులోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా వాదులాట జరిగింది. బీజేపీవాళ్లు కాంగ్రెస్ నేతల వాహనాలపై దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు పగిలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల పైన లాఠీచార్జీకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అగ్నిపథ్‌పై గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైన సమయంలో ధర్నా చేపట్టడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. బీజేపీ ఆఫీసు వద్ద కాకుండా వేరే ఎక్కడ నిరసన చేసినా ఇంత పబ్లిసిటీ రాదనేది హస్తం పార్టీ ఆలోచన. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అగ్నివీర్‌లను నియమిస్తారు. ఈ మేరకు అగ్నివీర్‌ల రిజిస్ట్రేషన్లు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ కొత్త నియామక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. సైనికులను అడ్డా మీద కూలీల్లా మార్చొద్దని హితవు పలుకుతోంది.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!