Bengal Waqf Violence: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు ఇద్దరు తండ్రికొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengal violence: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి.
Waqf law: ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ చట్టానికి కోటి మంది వ్యతిరేకంగా చేసిన సంతకాల చేసిన తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ పంపుతామని చెప్పారు. కోల్‌కతా రాంలీలా మైదానంలో జరిగిన భారీ సమావేశంలో జమియిత్ బెంగాల్ చీఫ్, రాష్ట్ర మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
Waqf protest: వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనల పేరుతో అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడుతున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్ష నెలకొంది. ఈ ప్రాంతంలో కీలకమైన రహదారిని అడ్డుకోకుండా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు పిటిషన్లు దాఖలు చేయగా, పలు పార్టీలు కూడా పిటిషన్లు వేస్తున్నాయి.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది.
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.