Waqf law: ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ చట్టానికి కోటి మంది వ్యతిరేకంగా చేసిన సంతకాల చేసిన తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ పంపుతామని చెప్పారు. కోల్‌కతా రాంలీలా మైదానంలో జరిగిన భారీ సమావేశంలో జమియిత్ బెంగాల్ చీఫ్, రాష్ట్ర మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
Read Also: CM Chandrababu : రేపు ఒంటిమిట్ట కోదండ రామయ్య దర్శనానికి సీఎం చంద్రబాబు… పూర్తి షెడ్యూల్ ఇదే..!
వక్ఫ్ చట్టానికి వ్యతిరేంగా న్యాయ పోరాటం చేయడానికి జమియత్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు వచ్చే వారం అనేక పిటిషన్లను విచారించనుంది. వివిధ జిల్లాలు, పట్టణాలత నుంచి సంతకాలను సేకరించి మోడీకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25 మరియు 26 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను వక్ఫ్ చట్టం ఉల్లంఘించిందని జామియత్ మెమోరాండం పేర్కొంది. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించింది.