వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని…
వక్ఫ్ సవరణ బిల్లుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు సహనం, వైవిధ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా అందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూనే, ఇమ్రాన్ మసూద్ తాజాగా ఏర్పడబోయే బోర్డు గురించి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారని, వారిలో 10 మంది మాత్రమే ముస్లింలు ఉంటారన్నారు. ఈ విధంగా.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర…
దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్ల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు కొందరు మద్దతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లకు జెడియు, టిడిపి, జెడిఎస్ వంటి పార్టీల మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్ష కూటమి బిల్లుకు వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అభివర్ణించింది. బిల్లును వ్యతిరేకిస్తామని ఎస్పీ చెబుతోంది. ఇలాంటి తరుణంలో తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. Also Read:Team India Captain:…
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం దీనికి మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్‌డీఏ, దాని మిత్రపక్షాలు ఐక్యంగా ఉండగా, ఇండియా బ్లాక్ దీనికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఈ వక్ఫ్ బిల్లుపై వాదనలు జరుగుతున్నాయి. పార్లమెంటులో చర్చకు ఎనిమిది గంటలు కేటాయించారు. ఇందులో ఎన్డీఏకి మొత్తం 4 గంటల 40 నిమిషాల…
Waqf Bill: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ముస్లింలకు ప్రయోజనకరం కాకుండా హానికరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసి రసూల్ ఇలియాస్ వార్నింగ్ ఇచ్చారు.
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుంచారు. రిజిజు ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన…
Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని కేంద్రం ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్‌సభ ముందు ఉంచారు. బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో భాగం కానీ అంశాలపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు…