Bengal violence: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. అయితే, ఈ అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి లేఖ రాశారు. ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి వెనక కీలక కుట్రదారుల్ని వెలుగులోకి తేవాలాని, నేరస్తుల్ని గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విచారణ సహాయపడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: “సంఘటన్ సుజన్ అభియాన్” ప్రారంభం.. సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం..
శుక్రవారం, ముర్షిదాబాద్‌లోని ధులియన్ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది, ఒక గుంపు రిలే గదిని ధ్వంసం చేసింది. రైల్వే ఉద్యోగుల వాహనాలకు నిప్పుపెట్టారు. ఉద్యోగులు ఈ అల్లర్ల వల్ల ప్రాణభయంతో పారిపోయారు. దీంతో తూర్పు రైల్వేలో పలు రైళ్లను దారి మళ్లించారు. ఇలాంటి అల్లర్లు దేశానికి ముప్పు కలిగిస్తాయని సువేందు అధికారి అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ముర్షిదాబాద్‌లో పీఎఫ్ఐ, సిమి వంటి నిషేధిత సంస్థలు పనిచేస్తున్నాయనని, ఇవి సరిహద్దుల్లో చిక్కుల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన లేఖలో అన్నారు.
ఈ కేసును ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏకి అప్పగించడం వల్ల వేగవంతమైన, సమగ్రమైన, తటస్థ దర్యాప్తు జరుగుతుందని బీజేపీ అన్నారు. ధులియాండంగా, నిమ్టిటా స్టేషన్ల మధ్య హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో రైలు సేవలకు 6 గంటల పాటు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ అల్లర్లలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. 118 మందిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి జావేద్ షమీమ్ చెప్పారు.