మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. A టు C సెంటర్ తో సంబంధం లేకుండా చిరు చేస్తున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూస్తుంటే…
‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’… అనే టైటిల్ చూసి అదేంటి చిరు లాస్ట్ మూడు సినిమాలే కదా ఫ్లాప్ అయ్యింది, అంతక ముందు హిట్ కొట్టాడు కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోకండి. 2007 నుంచి 2017 వరకూ దశాబ్దం పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నటించిన సైరా సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ నే…
వాల్తేరు వీరయ్య సినిమాతో అమలాపురం నుంచి అమెరికా వరకూ రీసౌండ్ వచ్చే రేంజులో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా మెగా మేనియా వినిపిస్తూనే ఉంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 12-0 కోట్ల వరకూ గ్రాస్ ని రాబట్టింది అంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఊహించొచ్చు. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో నుంచి బయటకి వచ్చి…
ఆన్ లైన్ లో రిలీజ్ కి ముందే రోజే టికెట్ బుక్ చేసుకోని థియేటర్స్ వెళ్లే ఆడియన్స్ ఉన్న రోజులు ఇవి. టికెట్స్ కోసం పెద్దగా కష్టపడకుండా బుక్ మై షో, పేటీయమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో బుక్ చేసుకోని సినిమా చూసే వాళ్లకి ఫస్ట్ రోజు మొదటి షోకి టికెట్ కోసం థియేటర్ దగ్గర క్యు నిలబడి టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలియదు. మాములు హీరోకే మొదటి రోజు మొదటి షోకి థియేటర్స్ దగ్గర…
సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది. ఈ వేడిని మరింత పెంచుతూ, పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు తమ సినిమాలతో…
గత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో యాంటి ఫాన్స్ నుంచి చిరు పని అయిపొయింది అనే మాట వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి మాటలని గత ముప్పై అయిదు సంవత్సరాలుగా వింటూనే ఉన్న చిరు, తన పని అయిపొయింది అనే మాట బయటకి వచ్చిన ప్రతిసారీ దాన్ని పాతాళంలో పాతేసే రేంజ్ హిట్ కొట్టాడు. ఎప్పుడూ చేసే లాగే ఈసారి కూడా తనపై వస్తున్న కామెంట్స్ ని అదఃపాతాళంలో పాతేసాడు చిరు. సంక్రాంతి పండగని ఒకరోజు…
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల…
రవితేజ అనగానే ప్రతి ఒక్కరికీ తెరపైన హై వోల్టేజ్ హీరో ఒకడు గుర్తొస్తాడు. తనదైన డైలాగ్ డెలివరీతో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయిన రవితేజ అంటే సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. ఈ మాస్ మహారాజ కామెడీ మాత్రమే కాదు సీరియస్ ఎమోషన్ ని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చెయ్యగలడని నిరూపించిన సినిమా ‘విక్రమార్కుడు’. ఈ మూవీలో రవితేజ ‘అత్తిల్లి సత్తిబాబు’ పాత్రలో రెగ్యులర్ గానే బాగా నటించాడు, నవ్వులు కూడా…
గత మూడు సినిమాలుగా సినీ అభిమానులని కాస్త నిరాశ పరుస్తున్న చిరు, మెగా తుఫాన్ గా మారి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చిన చిరు, ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాడు. ప్రీమియర్స్ నుంచే మొదలైన చిరు ర్యాంపేజ్ ఎక్కడా స్లో అయినట్లు కనిపించట్లేదు. రెండు రోజుల్లోనే మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా, మెగాస్టార్ హిట్ కొడితే కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో ప్రూవ్…