Chiranjeevi: మెగా తుఫాన్… మూడోసారి వంద కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. A టు C సెంటర్ తో సంబంధం లేకుండా చిరు చేస్తున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూస్తుంటే యంగ్ స్టార్ హీరోల అభిమానులు కూడా అవాక్ అవుతున్నారు. ఇది కదా మెగాస్టార్ స్టామినా అంటూ మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. చిరు వంద కోట్ల షెట్ రాబట్టడం ఇదే మొదటిసారి కాదు, తన రీఎంట్రీ తర్వాత మొదటిసారి ఖైదీ నంబర్ 150 సినిమాతో చిరు వంద కోట్ల షేర్ ని రాబట్టాడు. ఆ తర్వాత సైరా సినిమాతో మరోసారి 100 షేర్ కి కలెక్ట్ చేశాడు.
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు కానీ ఈసారి అందరికీ ఫుల్ మీల్స్ పెడుతూ చిరు వంద కోట్లు రాబట్టాలి అంటే యావరేజ్ సినిమా చాలు అని ప్రూవ్ చేసింది వాల్తేరు వీరయ్య సినిమా. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో చిరువి మూడు సినిమాలు ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ఇస్తోంది. ఈ మెగా సక్సస్ ని ఎంజాయ్ చేస్తూ ఓవర్సీస్ లో మెగా ఫాన్స్ స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. మెగా వాచ్ పార్టీ అంటూ ఒకేసారి, ఒకేరోజు నార్త్ అమెరికాలోని 25 సిటీస్ లో వాల్తేరు వీరయ్య స్పెషల్ షోస్ వేస్తున్నారు. మెగా ఫాన్స్ పూనకాలు రిపీటింగ్ అంటూ ఈ మెగా వాచ్ పార్టీని ఎంజాయ్ చెయ్యబోతున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!

Mega Watch Party
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!