Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఊచకోత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనబడట్లేదు. సినిమా రిలీజై పదిరోజులైనా కూడా భారీ స్థాయిలో కలెక్షలు రాబడుతూ దూసుకెళ్తోంది. అమలాపురం టూ అమెరికా ఎక్కడ చూసినా ఈ మూవీ కలెక్షన్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ మూవీ 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అలాగే యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద 2.25 మిలియన్ డాలర్లను దాటి 3 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.
ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికెల్లావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి తగ్గట్టే కలెక్షన్లూ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి రోజే అనుకంటే రెండో రోజు కూడా భారీ కలెక్షన్‌లు రాబడుతూ అందరిని ఆశ్చర్యంలో పడేసింది. రీ ఎంట్రీ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్‌లు ఏ సినిమా రాబట్టలేకపోయింది. ఇక చిరుకు రవన్న తోడవడంతో నిర్మాతలపై కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాలతకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో ఉంది.
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Womens IPL: విమెన్స్ ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 600 కోట్లు!
అలాగే, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ మూవీ పదో రోజు రూ.6.6 కోట్లు కలెక్ట్ చేసి నాన్-రాజమౌళి రికార్డు సాధించింది. నిజానికి ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది. కానీ టాక్‌తో సంబంధలేకుండా కలెక్షన్‌ల వేట కొనసాగిస్తుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ నటించింది. ఇక రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!