2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఇప్పట్లో డ్రాప్ అయ్యేలా కనిపించట్లేదు. గత మూడు సినిమాలుగా నిరాశ పరుస్తున్న చిరంజీవి, వీల్తేరు వీరయ్యతో హిట్ లోటు తీర్చేయ్యగా… తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ జోనర్ లో మరోసారి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’గా కనిపించి హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాలని అంత గొప్పగా తెరకెక్కించిన ఇద్దరు దర్శకులు బాబీ మరియు గోపీచంద్ మలినేని. మెగా ఫ్యాన్ అయిన బాబీ ‘వాల్తేరు వీరయ్య సినిమాని’ మెగా అభిమానులకి గిఫ్ట్ గా ఇవ్వగా బాలయ్య ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమాని మాస్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.
రెండు పెద్ద సినిమాలు, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, ఇద్దరు అభిమానులు తీసిన సినిమాలు ఒకేసారి థియేటర్స్ కి వచ్చి హిట్ అవ్వడంతో దర్శకులు ఎమోషనల్ అయ్యారు. ‘ఆశించాను కానీ ఊహించలేదు, ఇంతటి విజయం అందించిన ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని గోపీచంద్ మలినేని ఒక నోట్ ని రిలీజ్ చేశాడు. దర్శకుడు బాబీ కూడా ‘వాల్తేరు వీరయ్య సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ఈ విజయం మీది నాది మన అందరిదీ’ అంటూ ఒక లెటర్ ని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గోపీచంద్ మలినేని, బాబీ రిలీజ్ చేసిన ఈ రెండు ఎమోషనల్ నోట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాకి బాబీ రైటర్ గా పని చెయ్యడం విశేషం.
ఇది వీర సింహ విజయం.. ధన్యోస్మి 🙏
సంక్రాంతి శుభాకాంక్షలు ❤️#HappyMakarSankranti #VeeraSimhaReddy pic.twitter.com/nJTkyrIn3e— Gopichandh Malineni (@megopichand) January 15, 2023
ఈ సంక్రాంతి నాకు ఆజన్మాంతం గుర్తుండి పోతుంది.❤️
Love & Gratitude to you all 🙏🙏#HappyMakarSankranti #WaltairVeerayya pic.twitter.com/bQsATqqu9w— Bobby (@dirbobby) January 15, 2023