రవితేజ అనగానే ప్రతి ఒక్కరికీ తెరపైన హై వోల్టేజ్ హీరో ఒకడు గుర్తొస్తాడు. తనదైన డైలాగ్ డెలివరీతో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయిన రవితేజ అంటే సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. ఈ మాస్ మహారాజ కామెడీ మాత్రమే కాదు సీరియస్ ఎమోషన్ ని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చెయ్యగలడని నిరూపించిన సినిమా ‘విక్రమార్కుడు’. ఈ మూవీలో రవితేజ ‘అత్తిల్లి సత్తిబాబు’ పాత్రలో రెగ్యులర్ గానే బాగా నటించాడు, నవ్వులు కూడా పూయించాడు కానీ రెండో పాత్ర అయిన ‘విక్రం సింగ్ రాథోడ్’లో రవితేజ అద్భుతంగా నటించాడు. పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా రవితేజ చేసిన యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ వరకూ రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలో సూపర్బ్ వేరియేషన్ చూపించాడు. అందుకే ఈ మూవీ అంటే మాస్ మహారాజ అభిమానులకి చాలా ఇష్టం. దాదాపు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కామెడీతో పాటు సీరియస్ ఎమోషన్ కి ప్లే చేశాడు రవితేజ.
ధమాకా సినిమాతో ప్రతి ఒక్కరినీ నవ్వించి 100 కోట్లు కొల్లగొట్టిన రవితేజ, వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తమ్ముడు ‘ACPవిక్రమ్ సాగర్’ పాత్రలో నటించి మెప్పించాడు. పోలిస్ పాత్రలో రవితేజ కనిపించిన విధానం, ఎమోషనల్ సీన్స్ లో చిరుతో రవితేజ పండించిన సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. విక్రమర్కుడు సినిమాలోని ‘విక్రం సింగ్ రాథోడ్’, వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘విక్రం సాగర్’ పాత్రలో ఉన్న కామన్ పాయింట్ ఈ ఇద్దరూ చాలా స్ట్రాంగ్ పోలిస్ ఆఫీసర్స్. ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ చేసుకోగల ఈ పాత్రల స్థాయిలో ఇంకో రోల్ ని కూడా రవితేజ అద్భుతంగా నటించాడు. బాబీ డైరెక్ట్ చేసిన పవర్ సినిమాలో రవితేజ నటించిన పాత్ర ‘బలదేవ్ సహాయ్’… ఈ రోల్ ని కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ప్లే చేశాడు రవితేజ. క్రాక్ సినిమాలో కూడా రవితేజ టిపికల్ కాప్ రోల్ ప్లే చేశాడు కానీ ఈ రోల్ కి కాస్త కామెడీ టచ్ కూడా ఉంటుంది, మిగిలిన పాత్రల్లో సీరియస్ ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. కామెడీనే కాదు రవితేజ ఏదైనా చెయ్యగలడు అని సక్సస్ ఫుల్ గా చెప్పిన ఈ మూడు సినిమాలు రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్.