Sundar Pichai: గూగుల్ పిచాయ్‌కు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చు తెలుసా!
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన CEOగా రికార్డు..
- సుందర్ పిచాయ్‌కు 'మెగా' జాక్‌పాట్..
- రూ.6,400 కోట్ల ప్యాకేజీతో పిచాయ్‌కు ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundar Pichai: భారత సంతతికి చెందిన గూగుల్ (Alphabet) సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కంపెనీ బోర్డు ఆయనకు ప్రకటించిన సరికొత్త జీతం ప్యాకేజీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే మూడేళ్ల కాలానికి గానూ పిచాయ్ ఏకంగా $692 మిలియన్లు (సుమారు రూ.6,400 కోట్లు) అందుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయనకు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చని అంటున్నారు. ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
ప్యాకేజీ లెక్కలు ఇవే..
సుందర్ పిచాయ్ అందుకునే ఈ భారీ మొత్తంలో కేవలం నగదు మాత్రమే లేదు, మెజారిటీ భాగం స్టాక్ యూనిట్ల రూపంలో ఉంది. గూగుల్ సీఈఓకు ఏడాదికి $2 మిలియన్లు (సుమారు రూ.17 కోట్లు) అందుతాయి. అలాగే $126 మిలియన్ల విలువైన స్టాక్ యూనిట్లు కూడా లభిస్తాయి. కంపెనీ పనితీరు (S&P 100 తో పోలిస్తే) అద్భుతంగా ఉంటే, ఇది రెట్టింపు అయి $252 మిలియన్లకు చేరుతుంది. కంపెనీలో కొనసాగుతున్నందుకు గానూ మరో $84 మిలియన్ల విలువైన షేర్లు నెలవారీగా ఆయన ఖాతాలో జమ అవుతాయి. గూగుల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులైన ‘వేమో’ (సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు), ‘వింగ్’ (డ్రోన్ డెలివరీ) వృద్ధికి అదనంగా $350 మిలియన్ల స్టాక్ ఇన్సెంటివ్‌లను జత చేసింది. ఇదే సమయంలో పిచాయ్ తనకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తే, ఆయన మొత్తం సంపాదన గరిష్టంగా $692 మిలియన్లకు చేరుతుంది. లక్ష్యాలు చేరకపోతే ఈ అదనపు ప్రయోజనాలు ఏవీ లభించవు.
పిచాయ్ హయాంలో గూగుల్ ప్రస్థానం..
2015 ఆగస్టులో సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టినప్పుడు గూగుల్ మార్కెట్ విలువ $535 బిలియన్లు. నేడు అది $3.6 ట్రిలియన్లకు (జనవరిలో $4 ట్రిలియన్లు దాటింది) చేరుకుంది. అంటే దాదాపు 7 రెట్లు వృద్ధి సాధించింది. ఇదే సమయంలో గూగుల్ AI రేసులో కూడా పుంజుకుంది. మొదట్లో ChatGPT రాకతో గూగుల్ వెనకబడిందనే విమర్శలు వచ్చినా, పిచాయ్ తనదైన శైలిలో ‘Gemini’ వంటి AI మోడళ్లను ప్రవేశపెట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను మరింత శక్తివంతం చేశారు. 2004లో క్రోమ్ బ్రౌజర్ డెవలపర్‌గా చేరిన పిచాయ్, నేడు తన కష్టార్జితంతో బిలియనీర్ల జాబితాలో చేరారు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. సుందర్ పిచాయ్, ఆయన భార్య అంజలి పిచాయ్ వద్ద ప్రస్తుతం 1.67 మిలియన్ గూగుల్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ సుమారు $498 మిలియన్లు (దాదాపు రూ.4,100 కోట్లు). అంతేకాకుండా, పిచాయ్ వ్యక్తిగత భద్రత కోసం గూగుల్ 2024లో $8.3 మిలియన్లు ఖర్చు చేయడం గమనార్హం. అపారమైన మేధస్సు, ఓర్పుతో గూగుల్‌ను శిఖరాగ్రాన నిలబెట్టిన సుందర్ పిచాయ్‌కు ఈ ప్యాకేజీ ఒక తగిన గౌరవమని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాంటీట్రస్ట్ కేసులు, AI పోటీ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, బోర్డు ఆయనపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ ‘మెగా ఆఫర్’ ఇచ్చింది.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!