Bandla Ganesh: సాయిరెడ్డిపై ఓ రేంజ్‌లో బండ్ల గణేష్ ఫైర్.. చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టoడి. కానీ, చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు అని హెచ్చరించిన ఆయన.. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు.. నేను కమ్మ వాణ్ణే.. కానీ, టీడీపీ కాదు సాయిరెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు..
Read Also: Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ సాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు బండ్ల గణేష్.. నాకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం.. కానీ, నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. నువ్వు పెద్ద దరిద్రానివి.. మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లోకి లాగుతున్నవ్..? అని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో అని హితబోధ చేశారు.. అన్ని కులాల్లో మంచి వాళ్లు చెడ్డ వాళ్లు ఉంటారు సాయిరెడ్డి అని పేర్కొన్న గణేష్.. చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో.. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు అని హెచ్చరించారు. నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైల్‌కు పంపింది.. కమ్మ వారు కాదు అన్నారు.. త్వరలో నువ్వు జగన్‌కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి… ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో కూడా తెలుసు.. అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు బండ్ల గణేష్.
ఇక, కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు అని సాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు బండ్ల గణేష్.. కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్న.. నీకు నచ్చనివారిని పేరు పెట్టి తిట్టు.. దయచేసి కులాన్ని తిట్టకు.. ఇదేనా నీ సంస్కారం ? అని ప్రశ్నించారు. నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు.. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావూ అంటూ మండిపడ్డారు.. జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు అని సూచించిన ఆయన.. నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తాను అని స్పష్టం చేశారు. ఇక, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు.. అది నీకు మంచిది కాదు… టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు ? అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం.. విశాఖలో దోచుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నవు.. ఇది ప్రపంచానికి తెలుసని పేర్కొన్న ఆయన.. ఈ పిరికి ముసలి నా కొడుకిని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్లాక్ చేసి మింగుతాడు. వేస్ట్ గాడు.. అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్‌కి జనం కారం పెట్టడం ఖాయం అని హెచ్చరించారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ మండిపడ్డారు.. ఇక, తన ప్రతీ ట్వీట్‌ను విజయసాయిరెడ్డికి ట్యాగ్ చేశారు బండ్ల గణేష్.
తాజావార్తలు
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!