సాగరతీరం విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఆర్అండ్ అతిథి గృహం వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి శిశు గృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శిశు గృహ సంరక్షకులు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డుపై ఉన్న ముగ్గురు చిన్నారులను వారం రోజుల క్రితం గుర్తించిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు శిశు గృహంలో చేర్చారు.
తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణగా ఉంచాలని కోరుతూ శిశు గృహ కు అప్పగించారు. కానీ అసలేం జరిగిందో ఏమో. నిన్న ఉదయం గేటు బయట ఆడుకుంటూ అదృశ్యం అయ్యారు మహాలక్ష్మి(6) ఏడుకొండలు(4) మరియమ్మ(2) అనే చిన్నారులు. చుట్టూ పక్కల వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. కూలీ పనులు చేసుకోవడానికి వేరే ప్రాంతం నుంచి తమ తల్లిదండ్రులతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు పిల్లలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు.
Nara Lokesh: ఇంకెంతమంది ఆడబిడ్డలు బలవ్వాలి?