విశాఖ టూర్ లో బిజీగా వున్నారు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. డాబాగార్డెన్స్ లోని ప్రేమ సమాజంలో 90వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రేమ సమాజం సావనీర్ ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ప్రేమ సమాజంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మానవ సేవ మాధవ సేవ..కష్టాలలో ఉన్నవారికి చేయూత నివ్వట౦ భారతదేశ స౦స్క్రతిలోనే అంతర్భాగంగా ఉందన్నారు.
నేను చదువుకునే రోజులలో ప్రేమ సమాజం చేపట్టే కార్యక్రమాలలో పాల్గొన్నాను. కుల మత వర్గ బేధాలు లేకుండా అనాధ బాలలు , పెద్దలు,కుష్టు వ్యాధి గ్రస్తులకు ఆశ్రయం కల్పించటం మామూలు సేవ కాదు. ప్రతి ఒక్కరు స౦పాది౦చాలి….స౦పాది౦చిన దానిలో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలి. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా మా కుటుంబ సభ్యులు, స్నేహితులు చేస్తోన్న సేవ నాకు చాలా ఆనందం ఇస్తుందన్నారు.
ఓ సాధారణ రైతు కుటుంబంలో ఉన్న నేను ఇ౦త ఉన్నత స్థితికి చేరుకోడానికి ప్రధాన కారణం క్రమ శిక్షణ, అ౦కిత భావ౦, సేవా భావ౦. భారతీయ స౦ప్రదాయ దుస్తులను ధరించ౦డి. చెరువులోని నీరుకి తూము ఎలా రక్షణగా ఉంటుందో అలాగే మన స౦పదకు దాన౦ రక్షణగా నిలబడుతుందన్నారు వెంకయ్యనాయుడు.
Venkaihnaidu
సేవ చేయడం ఓ మహద్భాగ్యంగా నేను భావిస్తాను. అది అందరికీ దొరికే అవకాశం కాదు. సద్వినియోగం చేసుకునే వారికి అదో అంతులేని ఆనందం. కుల, మత బేధభావాలు లేకుండా అన్ని వర్గాలకు సేవలను అందిస్తూ ఆ రోజుల్లోనే ప్రేమసమాజం ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం- వెంకయ్యనాయుడు
Read Also: Nani’s Jersey turns 3 : డిలేటెడ్ సీన్… ఇలాంటి సన్నివేశాన్ని మిస్ అయ్యామే !!