విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు…
జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం విలేఖరుల సమావేశంలో వెల్లడించిన గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83…
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 1 వతేదీ నుంచి జూన్ 29 వరకు ఈ వారాంతపు రైళ్లను నడపనుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 08579/08580.. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి…
అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…
విశాఖ లోని గాజువాక లో చీటీల పేరుతో నాలుగు కోట్ల మేర మోసం చేసింది గాజువాక కు చెందిన గంగాభవాని అనే మహిళ..ఆమెను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. విషయం తెలుసుకున్న బాధితులంతా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు బాధితులు.విశాఖ గాజువాక కు చెందిన గంగ భవాని అనే మహిళ చుట్టుపక్కల ఉన్న వారితో మంచి మాటలు చెప్పే చీటీల పేరుతో వారి నుండి అధిక…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
అసని తుఫాన్ మీద సీఎం జగన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపిన ఆయన.. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని.. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సూచించారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పిన సీఎం జగన్.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.…
ఒక్కగానొక్కడ కొడుకు.. ఘనంగా పెళ్ళి నిర్వహించాలని బంధుమిత్రులందరినీ తల్లిదండ్రులు ఆహ్వానించారు.. అందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.. రాత్రంతా అందరూ సంతోషంగా గడిపారు.. ఉదయమే లేచి ఇతర పనులన్నీ సిద్ధం చేసుకోవాలని అనుకొని పడుకున్నారు.. తీరా ఉదయం లేచి చూస్తే.. పెళ్ళి కొడుకు చేసిన పనికి విషాదఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత, తన గదిలోకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..…
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రుషికొండలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీని నియామకం చేసింది ఎన్జీటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశాలు…
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య…