Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన ఆసాని తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ఈనెల 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
ఇది వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుంది. ఆ తరువాత ఈరోజు సాయంత్రానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆసాని తుఫాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి ఏపీ, బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తుఫాను నేపథ్యంలో అండమాన్ సహా.. ఒడిశా, బెంగాల్, సిక్కిం, అస్సాం, ఏపీ, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అయితే .. తుఫాన్ హెచ్చరికతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, మధ్య ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుఫాన్ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దాంతో విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసాని తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తుపాన్ కి ‘ఆసాని’ అని నామకరణం
బంగాళఖాతంలో ఏర్పడే తుపాన్ లకు ఆచుట్టూ ఉండే దేశాలు వంతుల వారీగా తుపాన్లకు నామకరణం చేస్తాయి. ఈసారి రాబోయే తుపాన్ కు పేరు పెట్టే అవకాశం శ్రీలంక కు వచ్చింది. రాబోయే తుపాను కు ఆసాని అనే పేరును శ్రీలంక ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సింహళ భాషలో ఆసాని అంటే కోపం, ఆగ్రహం అని అర్ధం అంట. అయితే ఈ ఆసాని ఆగ్రహానికి ఎన్ని విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.విశాఖకు 1000కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి వుంది ఆసాని తుపాన్. సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారనుంది ఆసాని.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!