విశాఖ లోని గాజువాక లో చీటీల పేరుతో నాలుగు కోట్ల మేర మోసం చేసింది గాజువాక కు చెందిన గంగాభవాని అనే మహిళ..ఆమెను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. విషయం తెలుసుకున్న బాధితులంతా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు బాధితులు.విశాఖ గాజువాక కు చెందిన గంగ భవాని అనే మహిళ చుట్టుపక్కల ఉన్న వారితో మంచి మాటలు చెప్పే చీటీల పేరుతో వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని గత ఐదు నెలలుగా ఇల్లు వదిలి పరారైంది.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భవానీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు అధిక సంఖ్యలో వచ్చారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు. విశాఖ లోని గాజువాక లో భారీ మోసం బయట పడింది. చీటీల పేరుతో 5 కోట్ల మేర మోసం చేసింది గాజువాక కు చెందిన గంగాభవాని అనే మహిళ. తమను నమ్మించి మోసం చేసిన గంగా భవానీపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చిట్టీల పేరుతో ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు అంటున్నారు.
Talasani Srinivas Yadav:కళ్ళుండి చూడలేని కాబోదులు బీజేపీ నాయకులు