విశాఖలోని రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రుషికొండలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది.
దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీని నియామకం చేసింది ఎన్జీటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశాలు జారీచేసింది.రుషికొండవద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని, అక్కడ పర్యావరణానికి హాని జరుగుతోందని ఎంపీ రఘురామరాజు ఎన్జీటీకి కంప్లైంట్ చేశారు. దీనిపై ఎన్జీటీ స్పందించి తాజాగా ఈ ఆదేశాలు జారీచేసింది.
Hyderabad : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు సీఎంను కాపాడలేవ్