ముతుకుమిల్లి శ్రీభరత్..... తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్‌కు షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్‌లో ఓడిపోయారాయన. అప్పట్లో... ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే... భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి.…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుసగా మూవీ నుంచి అప్డేట్లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా అనౌన్స్ చేశారు. జులై 20న వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు.…
విశాఖ నగర నడిబొడ్డున గంజాయి సాగు కలకలం సృష్టించింది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రాస వీధి సమీపంలోని ఓ పాడు బడ్డ ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశంలో కొన్ని మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే, అవి గంజాయి మొక్కలను పోలినట్టే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు..
తీగ లాగితె డొంకంతా కదిలినట్టు.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తుంది.. విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు.. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు..
Simhadri Appanna: విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ మార్గంలో తొలి పావాంచా దగ్గర నిర్మించిన రేకుల షెడ్ కూలిపోయింది. షెడ్ కింద కాంక్రీట్ బేస్ లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో, షెడ్ కిందకి కుప్పకూలింది.
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల... టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్.
పరిస్థితుల్ని బట్టి ఓడలు బళ్ళు....బళ్ళు ఓడలు కామన్. రాజకీయాల్లో అయితే.... దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పనేలేదు. సరిగ్గా ఇప్పుడు అదే స్ధితిని అనుభవిస్తున్నారట ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. శాసనసభ్యులుగా గెలిచి ఏడాది పూర్తయిందన్న మాటేగానీ... సెల్ఫ్ శాటిశ్ఫాక్షన్ ఏ మాత్రం లేదట. 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన సీట్లన్నిటినీ కూటమి పార్టీలు ఏకపక్షంగా గెలుచుకున్నాయి.
ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో…
ఇన్సిడెంట్స్& హ్యాపెనింగ్స్ పొలిటికల్ లైఫ్‌ని మలుపు తిప్పుతాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. పోటీ చేయడానికి సీటే లేదనుకుంటున్న టైంలో ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించింది అధినాయకత్వం. రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబూరావుకు మరో నాలుగేళ్ళ పదవీ కాలం వుంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు.